ఇది ఎవరినీ నొప్పించటానికి కాదు! సరదాగా కాసేపు నవ్వుకొటానికి మాత్రమే!
ఇది ఇద్దరు లవర్స్ మధ్య సెల్ ఫోన్ లో కాలేజీ లైఫ్ లో జరిగే అతి సాధారణ conversation !
ఇప్పుడు టైం early morning 8 అనమాట!!
అమ్మాయ్ : గుడ్ మార్నింగ్ డియర్!
అబ్బాయ్ : గుడ్ మార్నింగ్!
అమ్మాయ్ : ఇప్పుడే లేచావా?
అబ్బాయ్ : అవును!
అమ్మాయ్ : బ్రష్ చేసావా?
అబ్బాయ్ : hmmm .. ఇప్పుడే, నువ్వు ?
అమ్మాయ్ : హే, దిస్ ఇస్ టూ మచ్ యా.. నేను నీతో మాట్లాడను పో..
అబ్బాయ్ : హే, ఏమయింది?
అమ్మాయ్ : మరేంటి? నేనేమి చేసినా నీకు చెప్పే కదా చేస్తాను , నువ్వు నాకు చెప్పకుండా బ్రష్ ఎందుకు చేస్కున్నావు!?
అబ్బాయ్ : ( ఛి, దీనికి పొద్దున్నే నేనే దొరికానా?) ఒహ్హో! సారీ యా!
అమ్మాయ్ : no more excuses !
ఇప్పుడు break fast టైం!
అబ్బాయ్ : సారీ యా!
అమ్మాయ్ : ఎందుకు?
అబ్బాయ్ : అదే, మార్నింగ్ నీకు చెప్పకుండా బ్రష్ చేసాను గా!
అమ్మాయ్ : పో రా!
అబ్బాయ్ : ఎక్కడికి!?
అమ్మాయ్ : హే , యు సిల్లీ! ఆ టాపిక్ మర్చి పోయాను లే కానీ.. break fast అయిందా?
అబ్బాయ్ : hmmm , తింటున్నా.. నీది?
అమ్మాయ్ : నేను కూడా.. మీది ఏం టిఫిన్?
అబ్బాయ్ : దోసెలు!
అమ్మాయ్ : నీకు ఇష్టమా?
అబ్బాయ్ : అవును , చాలా.. నీకు?
అమ్మాయ్ : నో, ఆయిల్ ఫుడ్ గా, నేను తినను బాబు!
అబ్బాయ్ : ఒహ్హో, ఇంకా..
అమ్మాయ్ : నువ్వే చెప్పాలి..
అబ్బాయ్ : నువ్వే చెప్పు!
అమ్మాయ్ : ఓకే, ఏం చట్నీ చేసారు, దోసె లోకి?
అబ్బాయ్ : పల్లీ చట్నీ!
అమ్మాయ్ : అల్లం పచ్చడి లేదా?
అబ్బాయ్ : నో, చేయలేదు..
అమ్మాయ్ : ఓకే లే , మాది ఇడ్లీ, అల్లం పచ్చడి , పల్లీ చట్నీ!
అబ్బాయ్ : ఇంకా
ఇప్పుడు 10 AM , venue : క్లాసు రూం!
అబ్బాయ్ : ఈ రోజు నీ డ్రెస్ బాగుంది!
అమ్మాయ్: రెడ్ కలర్ కదా?
అబ్బాయ్ : ( తొక్కలోది ఈ రోజు వేసుకుంది అదేగా , మళ్ళీ ఓవర్ ఆక్షన్) రెడ్ కలర్ నాకు నచ్చదు, బట్ నీకు భలే బాగుంది!
అమ్మాయ్: నాకు అంతే, ఏ కలర్ అయినా బాగుంటుంది!
అబ్బాయ్ : ( వేస్తున్నావ్ గా ) హా, అవును నిజమే!
అమ్మాయ్: ఎమ్ డూఇంగ్, క్లాసు వినకుండా!?
అబ్బాయ్ : నీదే బొమ్మ వేస్తున్నా!!
అమ్మాయ్: సోల్లెసావ్ లే !
అబ్బాయ్ : హ,హ,హ !! నువ్వు!?
అమ్మాయ్: ఇప్పుడే దోమ కుట్టింది రా, బుగ్గ పైన!
అబ్బాయ్ : లెఫ్ట్ చీక్ ఆ or రైట్ ఆ?
అమ్మాయ్: లెఫ్ట్ పైనే!
అబ్బాయ్ : దానికెన్ని గుండెలు, నా gf నే కుట్టడానికి!?
అమ్మాయ్: smiley !
అబ్బాయ్ : ఇంకా?
అమ్మాయ్: నువ్వే చెప్పాలి యా!
అబ్బాయ్ : కాదు, నువ్వే చెప్పు!
ఇప్పుడు టైం ఈవెనింగ్ 6 !
అమ్మాయ్: ఇక్కడ చల్లగా, గాలి వీస్తుంది బంగారం! నా జుట్టు డాన్సు చేస్తుంది ఆ గాలికి!
అబ్బాయ్ : హ,హ!
అమ్మాయ్: నువ్వేం డూఇంగ్?
అబ్బాయ్ : enjoying steaming cup of coffee in my left hand, Telugu weekly Swathi on my lap and chatting with a beauty on phone with my right hand !!
అమ్మాయ్: ఓవర్ ఆక్షన్ చేయకు రేయ్! you naughty and romantic fellow! నిజంగా అంత బాగుంటానా!?
అబ్బాయ్ :hmmm, అవును!
ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట! అంటే, నైట్ 1 !!
ఇప్పుడు స్లీపింగ్ టైం అనమాట! అంటే, నైట్ 1 !!
అబ్బాయ్ : గుడ్ నైట్
అమ్మాయ్: అప్పుడే, పడుకుంటున్నావా?
అబ్బాయ్ : హా, నిద్రొస్తుంది యా..
అమ్మాయ్: ప్చ్, నాకు నిద్ర పట్టట్లేదు రా!
అబ్బాయ్ :( నేనయిపోయానురా దేవుడా ఈ నైట్ !! )
ఇలా సాగుతూనే వుంటుంది ఇది, అంతం లేనిదిది!
ఇక నేను ఆపకపోతే, online storage capacity మొత్తం దీనికే సరిపోయేతట్లుంది!
ఇంతటితో సరిపెట్టుకోండి!!
ఇలా సాగుతూనే వుంటుంది ఇది, అంతం లేనిదిది!
ఇక నేను ఆపకపోతే, online storage capacity మొత్తం దీనికే సరిపోయేతట్లుంది!
ఇంతటితో సరిపెట్టుకోండి!!
చాలా సరదాగా ఉంది.అక్షరాలా నిజం .బాగా వ్రాసారు.
ReplyDeleteThank you Jyothi garu, support chesinanduku mariyu bagundi ani mechukunnadukuuu!
ReplyDeleteeey evara aa amai
ReplyDeleterey evarra aa amai? nijam chepu
ReplyDeleteసుబ్బారెడ్డి గారు, మీ మొబైల్ లో inbox items చూసే రాసానండి!!!!
ReplyDeleteమళ్ళీ నన్నడుగుతారేంటి!?
puranapandaphani garu meeku thanks!
ReplyDeleteedichav lae
ReplyDeletei like it '............... u r so smart
ReplyDeletesiva reddy bobbala