Thursday, December 22, 2011

Get reduce the mechanized life, and say hello to social, interactive life!




Genre ; Message oriented, a new year's message from కవితా మలయాలు!!

ఎలా రాస్తే మెసేజ్ రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచించి, నేను అయిదు సంవత్సరాలు గడిపిన నా హాస్టల్ కి అయినా రీచ్ అయితే , చాలు అని , గోకుల్ హాస్టల్ నే ఉదహరించి, అన్నీ యదార్థ సంఘటనలనే తీసుకుని రాయతలచాను!

( అన్ని చోట్ల ఇలానే ఉంటుందని ఏమీ కాదు!, ఎవరినీ ఉద్దేశించి కూడా కాదు, మా హాస్టల్ కి మాత్రమే ఈ మెసేజ్! )


అప్పుడు ( అంటే అయిదు సంవత్సరాల మునుపు )


ఇప్పుడు ( అంటే ప్రస్తుత కాలం )

* T.v రూమ్ లో మూవీ వేస్తున్నారంటే, నాలుగయుదు రోజుల ముందు నుండి, దాని గురించి చర్చ సాగేది , ఎప్పుడెప్పుడు వేస్తారా, అని వెయిట్ చేసే వాళ్ళం!! గ్రూప్ గా హాస్టల్ మొత్తం సరదాగా , సందడి సందడి గా , కామెంట్స్ తో , satires తో ఎంజాయ్ చేస్తూ చూసేవాళ్ళం!! చూసినాక కూడా , రెండు మూడు రోజులు చెప్పుకుంటూ వుండే వాళ్ళం!


* ఎవరో ఒకరో ఇద్దరో వుంటున్నారు ఆ రూమ్ లో! ప్రతి రూమ్ లో laptops ..ఎవరికి వారే, ఒంటరిగా , అది కూడా హెడ్ ఫోన్స్ తో!!



* సెల్ ఫోన్ rare గా కన్పించేది! ఫోన్స్, సెక్యూరిటీ దగ్గరున్న కామన్ ల్యాండ్ లైన్ కి వచ్చేవి! (seniors మమ్మల్ని ఒక రేంజ్ లో ఆట పట్టించే వారు, ఆ ఫోన్ కి అమ్మాయిలాగా , ఫోన్ చేసి! )

టీ టైం లో సరదాగా కబుర్లాడుకునే వాళ్ళం ! మామిడి చెట్ల కింద కూర్చుని ( మా మెస్ దగ్గర ఉండేవి )

టీ అలవాటు లేని నాకు , టీ ని addict చేసిన కబుర్లవి!! నన్నే కాదు , ఎవరినైనా ఇంతే!

అప్పటి కబుర్లలో కాలేజీ పక్కనున్న కేసరపల్లి నుండి 15 వేల మైళ్ళ అవతలున్న కెనడా వరకూ సంభందించిన అంశాలు ఉండేవి! 5 ;00 కి begin అయితే 7 ;30 అయ్యేది ఒక్కొకరోజు! seniors ఆ రోజు హాస్పిటల్ కి వచ్చిన cases discuss చేస్తే , అప్పుడు juniors గా ఉన్న మేము, ఆ రోజు క్లాసు లో జరిగిన funny incidents ని , ల్యాబ్ లోని కామెంట్స్ ని , చాల effective గా చెప్పే వాళ్ళం!!

That was a really healthy interaction between us !!!

*చెప్పే వాళ్ళు లేరు , వినే వాళ్ళు అంత కన్నా లేరు ! ఏదో మొక్కుబడికి ఇద్దరో ముగ్గురో కలిసి కూర్చుంటున్నారు! అది కూడా చేతిలో ఫోన్స్ తో!

" మామా, ఇవాళ్ళ Gynaec లో left uterine torsion case వచ్చింది రా "

అని చెప్పడానికి , ఆ sentence మధ్యలో "4 " స్పీడ్ బ్రకేర్స్! ( ఫోన్ లో వాళ్ళతో కూడా ఊసులాడలి కదా మరి, SMS language లో !!!!!! )

* హాస్టల్ to కాలేజీ, కాలేజీ to హాస్టల్ fatigue తప్పించుకోవటానికీ, exercise ల ఉపయోగపడుతుందనీనూ..evening టిఫిన్ కోసమనీ, నడుచుకుంటూ ( దాదాపు ఒక 600 మీటర్స్ వుంటుంది ) కేసరపల్లి వెళ్లి , పునుగులు తినేసి మళ్ళీ బ్యాక్ అయ్యే వాళ్ళం !

I enjoyed this up to my 4th year!

* ఇప్పుడు నడుచుకుంటూ కాదు కదా , even కిక్ కూడా కొట్టకుండా, "ఆటో స్టార్ట్ " నొక్కి , బైక్ మీద వెళ్లి వస్తున్నా( ము )!



ప్చ్! రోజులు బాగా మారాయి! మనిషికి మనిషికి మధ్య healthy relations తగ్గిపోయాయి, మనిషికీ electronics కి మధ్య interaction పెరిగిపోయింది! సాయి గారు చెప్పినట్లు
" మనిషి మనిషితో మాని మొబైల్ తో స్నేహం చేస్తున్నాడు
కనులు కనులతో మాని కంప్యూటర్ తో స్నేహం చేస్తున్నాయి
మనుసు మనసు తో మాని మనీ తో కలుస్తున్నాయి
"

Think your self!
ఏదయినా సాధించినా, ఇల్ హెల్త్ అయినా , ఫీలింగ్ బ్లూ అయినా.. అభినందించేది, సహకరించేది, ప్రోత్సహించేదీ.. తోటి మనిషి మాత్రమే!!
only human relation can able to solve that. Computers, i pods, cellphones can not! అనేది నా అభిప్రాయం. మీరేమంటారు మరి ?

ఇదే నా కవితా మలయాలు తరఫున కొత్త సంవత్సరపు మెసేజ్!!
కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు!!

Friday, December 9, 2011

కలసినప్పుడల్లా..మౌనమే.. మా మధ్యలో..!!


ఎదుట లేనప్పుడు :

కలల్లో, కళ్ళలో, ఊహల్లో..
నిరర్ఘలంగా మాటలు..
( హలో, ఇక్కడితో ఆగండి, మిగిలినవన్నీ సెన్సార్డ్ )

ఎదుట పడినప్పుడు :

పెదవులు విడిపోనంటాయి,
మాట రానంటుంది,
మౌనం రాజ్యమేలుతుంది,
Adrenaline లెవెల్స్ peak కి చేరి వుంటాయి,
పదానికీ, పదానికీ.. మధ్య, పదుల్లో pause లు..
మహాభారతం లో రాముడు వస్తాడు( denotes blackouts! )..
అడిగిన ప్రశ్నలకి అర్థంలేని సమాధానాలు..
చెప్పిన సమాధానాల్ని justify చేయడానికి సాధ్యం కాని వివరణలు..
ఎదుట వారి కళ్ళలోకి చూసే ధైర్యం చేయని కనులు దిక్కులకై వెదుకులాడతుంటాయి..

ఎంత silence అంటే, wrist watch లో సెకండ్స్ ముల్లు సౌండ్ clear గా విన్పించేటంత!
ఊపిరి తీసుకోవటం కూడా మరిచిపోయేంత టెన్షన్!
అది A /C రూమ్ అయినప్పటికీ చెమటలు పడుతుంటాయి..

ఎప్పటికీ కొత్తగానే.. ఉంటుంది.. ఆ situation నాకు!
ఇప్పటికి నిండా అయిదు సంవత్సరాలు!
అంటే ..
5 * 2 = 10 internals
5 * 1 = 5 externals
And Each with 5 - 10 viva voces
OMG!!
75 - 150 0f such so far!!

హ,హ,హ !!
Yeah !!
I'm talking about Examiner and me during viva!!!!!!