అతి త్వరలో!!
కవితలు, చిన్న చిన్న కథలు, హైకూలు, బావా మరదల్ల మధ్య కబుర్లు, కాలేజీ కబుర్లు, అప్పుడప్పుడు చిన్న చిన్న సందేశాలు.. ఇలా ఎన్నో! పేజీ తెరిస్తే చాలు, సాంతం ఆహ్లాదమే!!
Sunday, September 23, 2012
Friday, September 21, 2012
Dizygotic twins in Buffaloe observed in Veterinary Poly Clinic, Ongole, Prakasam District
Genre : A scientific Approach to the twinning in Buffaloes.
బక్కమంతుల తిరుపతిస్వామి, CRP క్వార్టర్స్ , Ongole కి చెందిన రైతు యొక్క గేదె 30 -08 -2012 గురువారం నాడు ఒంగోలు బహుళార్థ పశు వైద్య శాల లో కవల దూడలకి జన్మనిచ్చింది( Dystocia followed by Traction) . ఒకే కాన్పులో రెండు దూడలు పుట్టడం అనేది ఒక విధంగా అరుదైన విషయం అయినప్పటికీ ఈ కవలలలో ఒకటి ఆడ, ఒకటి మగ అనేది చాల అరుదయిన విషయమనే చెప్పుకోవాలి. ఇలాంటి కవలల్ని "Di-zygotic twins
" అని అంటారు.
గేదె ఎదలో వున్నప్పుడు రెండు అండాలు విడుదల అవటం కారణంగా, రెండూ అందాలు ఫలదీకరణం చెందటం కారణం గానూ, ఇలాంటి కవలల జననం జరుగుతుంది.
గర్భం లో రెండు దూడలు ఎదుగుదల జరుగుతున్న పరిణామక్రమంలో "placental anastomoses " ద్వారా, మగజాతి దూడ యొక్క ప్రత్యుత్పత్తి హార్మోనులు ఆడ జాతి దూడ శరీరంలో కి ప్రవేశించి ఆడ దూడని గర్భం లో ఉండగానే infertile ని చేస్తుంది. ఈ విధంగా జన్మించిన ఆడదూడని " freemartin " అని వైద్య పరిభాషలో చెప్పుకుంటారు. ఈ ఆడదూడ తర్వాతి కాలంలో ఎదలోకి రావటం జరగదు. మగదూడ మాత్రం సాధారణంగానే ఎటువంటి ప్రత్యుత్పత్తి లోపం లేకుండా జీవిస్తుంది.
Subscribe to:
Posts (Atom)