Friday, September 21, 2012

Dizygotic twins in Buffaloe observed in Veterinary Poly Clinic, Ongole, Prakasam District


Genre : A scientific Approach to the twinning in Buffaloes.

బక్కమంతుల తిరుపతిస్వామి, CRP క్వార్టర్స్ , Ongole కి చెందిన రైతు యొక్క గేదె 30 -08 -2012 గురువారం నాడు ఒంగోలు బహుళార్థ పశు వైద్య శాల లో కవల దూడలకి జన్మనిచ్చింది( Dystocia followed by Traction) . ఒకే కాన్పులో రెండు దూడలు పుట్టడం అనేది ఒక విధంగా అరుదైన విషయం అయినప్పటికీ కవలలలో ఒకటి ఆడ, ఒకటి మగ అనేది చాల అరుదయిన విషయమనే చెప్పుకోవాలి. ఇలాంటి కవలల్ని "Di-zygotic twins " అని అంటారు

గేదె ఎదలో వున్నప్పుడు రెండు అండాలు విడుదల అవటం కారణంగా, రెండూ అందాలు ఫలదీకరణం చెందటం కారణం గానూ, ఇలాంటి కవలల జననం జరుగుతుంది

గర్భం లో రెండు దూడలు ఎదుగుదల జరుగుతున్న పరిణామక్రమంలో "placental anastomoses " ద్వారా, మగజాతి దూడ యొక్క ప్రత్యుత్పత్తి హార్మోనులు ఆడ జాతి దూడ శరీరంలో కి ప్రవేశించి ఆడ దూడని గర్భం లో ఉండగానే infertile ని చేస్తుంది. విధంగా జన్మించిన ఆడదూడని " freemartin " అని వైద్య పరిభాషలో చెప్పుకుంటారు. ఆడదూడ తర్వాతి కాలంలో ఎదలోకి రావటం జరగదు. మగదూడ మాత్రం సాధారణంగానే ఎటువంటి  ప్రత్యుత్పత్తి లోపం లేకుండా జీవిస్తుంది.

No comments:

Post a Comment